- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19న బీఆర్ఎస్‌వీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్
బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ ఈ నెల 19న ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్‌లో నిర్వహిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ ఈ నెల 19న ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్‌లో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభ సెషన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొంటుండగా.. లంచ్ తర్వాత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆ తరువాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటల నుండి కేటీఆర్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారని తెలిపాయి. కేటీఆర్ విద్యార్థి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. వర్క్ షాప్ నేపథ్యంలో మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిషోర్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా.. ఈ నెల 21వ తేదీ తరువాత విద్యార్థి నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు పోరాటాలపై వారికి దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశం ఉంటుందని సమాచారం.






