BRSV: ప్రియాంక గాంధీ హామీకి విలువ ఇవ్వరా?

by Gantepaka Srikanth |

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సిఫార్సులకు కూడా సీఎం రేవంత్‌రెడ్డి విలువ ఇవ్వలేదని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

BRSV: ప్రియాంక గాంధీ హామీకి విలువ ఇవ్వరా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సిఫార్సులకు కూడా సీఎం రేవంత్‌రెడ్డి విలువ ఇవ్వలేదని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు బారీకేడ్లు ఎక్కి నిరసనకు దిగారు. వారందరినీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసినా ప్రభుత్వం 8 శాతానికే పరిమితం చేసిందన్నారు. గత సంవత్సరం బడ్జెట్‌లో పెట్టిన రీయంబర్స్‌మెంట్‌ను 80 శాతం విడుదల చేయలేదన్నారు. బకాయిలు రూ.8 వేల కోట్లు ఉంటే బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లే కేటాయించి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను మోసం చేశారని తెలిపారు.

విద్యాశాఖ కేటాయింపుల్లో రూ.18 వేల కోట్లు జీతాలకు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొరకు రూ.5 వేల కోట్ల కేటాయింపు మిగిలిందన్నారు. 2025-26 బడ్జెట్లో విద్యా శాఖకు 23,108 కేటాయించారని.. యంగ్ ఇండియా స్కూల్స్‌కి కేటాయింపులు మినహాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు తగ్గించారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.10 వేల కోట్ల బకాయిల ప్రస్తావన లేకుండా పోయిందన్నారు. విద్యానిధి పథకం పెట్టలేదని.. రూ.5 లక్షల విద్యా రుణం హామీ ఊసేలేదని తెలిపారు. 18 ఏళ్లు నిండిన బాలికలకు స్కూటీ పథకం లేదని పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ కాలెండర్ అమలు చేయాలని, ప్రియాంక గాంధీ ప్రచార హామీకి విలువ ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Next Story