దమ్ముంటే రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి చూపండి: గెల్లు శ్రీనివాస్ యాదవ్

by Ajay Maddhiboyina |

వరంగల్‌లో రైతు సంగ్రామ సభలో కేటీఆర్ ప్రసంగాన్ని చూసి కాంగ్రెస్ నేతలు పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

దమ్ముంటే రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి చూపండి: గెల్లు శ్రీనివాస్ యాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్‌లో రైతు సంగ్రామ సభలో కేటీఆర్ ప్రసంగాన్ని చూసి కాంగ్రెస్ నేతలు పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీదే పెద్ద 420 కుటుంబమని ఆరోపించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ రేవంత్‌రెడ్డి కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. గతంలో పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ పని తీరును ప్రశ్నించే వారని.. ఈయన ఓ డమ్మీ పీసీసీ చీఫ్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అవినీతి మహేశ్‌గౌడ్‌కు కనిపించడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై 13 లక్షల మంది విద్యార్థులను మోసం చేసినా ఆయనకు పట్టడం లేదన్నారు. ఆయన ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని నిలదీశారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు మహేశ్‌గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ నేతలు ఏదైనా మాట్లాడాలని అన్నారు.

Next Story