- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలతో బీఆర్ఎస్ పేగుబంధం ఏనాడో తెగింది.. కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీ తన ప్రాథమిక లక్ష్యాలను విస్మరించి పేరు మార్చుకోవడం వల్లే ప్రజలకు దూరం అయిందని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్న వేళ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు. కానీ, కాలక్రమంలో ఆ పార్టీ తన పేరును, పనితీరును, పార్టీ ఆత్మను కూడా మార్చుకుందంటూ సెటైర్లు వేశారు. దీంతో ఆ పార్టీకి ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోయిందని కామెంట్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రాథమిక ఉద్దేశ్యం, మూల సిద్ధాంతం (Core Issue) నుంచి పక్కకు తప్పుకుంటే, అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పక్కదారి పట్టడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేశాయని, ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయని.. వాటిని సాధించడమే తమ కొత్త పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిలబడే స్వచ్ఛమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఇప్పుడు తెలంగాణకు ఎంతైనా ఉందని కవిత స్పష్టం చేశారు.






