- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch elections: సర్పంచ్ ఎన్నికల్లో కొనసాగుతున్న బీఆర్ఎస్ హవా!
తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తున్నట్లు కన్పిస్తోంది. సిద్దిపేట జిల్లా, జగదేవ్ పూర్‌లోని మాందాపూర్ గ్రామంలో BRS బలపర్చిన అభ్యర్థి మౌనిక 60 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే, మర్కుక్ మండలంలోని గణేష్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రామలింగం ఘన విజయం సాధించారు. నల్లగొండ జిల్లా, అంతయ్యగూడెంలో బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి 21 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, చింతకుంట తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి జాటోత్ రవి 19 ఓట్లలో గెలుపు కైవసం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా, పెద్దేమూల్ మండలం, ఊరేంటి తండాలో BRS పార్టీ బలపర్చిన అభ్యర్థి సువర్ణ దన్‌సింగ్ సర్పంచ్ 17 ఓట్లతో విజయం సాధించారు.






