- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ కీ రోల్!
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరి(MLC Election Fight)లో బీఆర్ఎస్(BRS) పోటీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీ మద్ధతుదారులు ఈ ఎన్నికల్లో జయపజయాలను నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి(Decided Power)గా మారారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరి(MLC Election Fight)లో బీఆర్ఎస్(BRS) పోటీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీ మద్ధతుదారులు ఈ ఎన్నికల్లో జయపజయాలను నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి(Decided Power)గా మారారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు గురువారం పోలింగ్ ముగిసింది. పోటాపోటీ ప్రచారంతో ప్రలోభాలతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలుపుకోసం పోటీ పడ్డారు.
అయితే పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ మద్ధతుదారులు పోలింగ్ లో బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులలో ఎవరివైపు ఎంతమేరకు చీలిపోయారన్నది ఎన్నికల ఫలితాలలో కీలకంగా మారింది. నిజానికి రాష్ట్రంలో అసెంబ్లీలో మొత్తం 119స్థానాలుండగా..76 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకుండా ఉండటమే అందరిని విస్మయపరిచింది. లోక్ సభ ఎన్నికల్లో సున్నాకు పడిపోయిన పరువును ఈ ఎన్నికల్లో పోరాడటం ద్వారా నిలబెట్టుకునే అవకాశాన్ని ఆ పార్టీ వదిలేసుకుంది.
రాజకీయ లోపాయికారి కారణాలేమైనప్పటికి రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండికూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేయడం కేడర్ ను సైతం అయోమయానికి గురి చేసింది. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లా పరిధిలోని 42అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, గంగుల, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి వంటి దిగ్గజ ఎమ్మెల్యేల 16మంది బలం ఉంది. అయినప్పటికి ఆ పార్టీ ఈ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కనీసం గ్రాడ్యుయేట్ స్థానంలోనైనా పోటీకి దిగలేదు. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో 34అసెంబ్లీ స్థానాలకు 4గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఆయా ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించడం కొంత బీఆర్ఎస్ కు మైనస్.
ఇకపోతే వ్యూహాత్మక ఎత్తుగడనో లేక తప్పిదమో కాని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడంతో ఆ పార్టీ ఓటర్లు పోలింగ్ లో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరి పక్షాన ఎంతమేరకు చీలిపోయారన్నది మార్చి 3న జరిగే కౌంటింగ్ లో తేలనుంది. అలాగే క్రాస్ ఓటింగ్ ప్రభావం ఎంత అన్నది కూడా అదే రోజు స్పష్టం కానుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ -కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేయనుండగా..బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేయనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే బీఆర్ఎస్ చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేకత లేదని తేలిపోతుందని..బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం కూడా నెలకొంది.






