తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై బీఆర్ఎస్ ట్వీట్

by Gantepaka Srikanth |

తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై బీఆర్ఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కీలక పోస్టు చేసింది.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై బీఆర్ఎస్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై బీఆర్ఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కీలక పోస్టు చేసింది. ‘‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించిపోయింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కాసుల కటకట మొదలైంది. మార్కెట్లో లక్ష రూపాయలు కూడా పుట్టని గడ్డు పరిస్థితులు దాపురించాయి. సెప్టెంబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్‌ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్‌) 0.15%గా నమోదైనట్టు వివరించింది. ద్రవ్యోల్బణం నెగటివ్‌లోకి వెళ్లిన ఈ దుర్భర పరిస్థితిని కూడా ఓ విజయంగా ప్రచారం చేసుకోవాలనుకొన్న అధికార కాంగ్రెస్‌ పార్టీ బొక్కబోర్లా పడింది. ఒకవేళ వరుస డిఫ్లేషన్‌ అనేది సానుకూల సంకేతమైతే, దేశంలో మరెక్కడా ఈ పరిస్థితి లేనేలేదు. గడిచిన 11 ఏండ్లలో తెలంగాణలో ఎన్నడూ ఇది కనిపించలేదు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై రేవంత్‌రెడ్డికి పట్టులేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యమే రాష్ట్ర ఆర్థికం అతలాకుతలం కావడానికి, ప్రజల ఆర్థిక స్థితి రోజురోజుకూ దిగజారిపోవడానికి కారణం’’ అని బీఆర్ఎస్ పేర్కొంది. ట్వీట్

Next Story