హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

by Thanuru Gopichand |

హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట కొనసాగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.

హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట కొనసాగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసే కుట్రను బహిర్గతం చేశామని వెల్లడించారు. గురువారం బహదూర్‌పూర్, చందూలాల్, బరదరి ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ మంత్రి మహమూద్ అలీతో కలిసి ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కాంను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నదని ఆరోపించారు. పారిశ్రామిక భూములను కాజేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలను దోచుకునేందుకు భూముల విలువను రాజకీయంగా వినియోగించుకునేందుకు ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భూముల చుట్టూ పాలన మాత్రమే చేస్తున్నదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి భూముల దోపిడీకి ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. పారిశ్రామిక భూముల్లో కాసుల వేట కోసమే హిల్ట్ పాలసీని రూపొందించారని.. ఇది పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులకు, ఉపాధికి తీవ్ర ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నుముకలాంటిదైన పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరిట చెలగాటం ఆడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే హిల్ట్ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సలీమ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్డండా వెంకటేశ్‌, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, ముకేద్ చందా, యాకుత్‌పురం మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ సుందర్ రెడ్డి, పుస్తే శ్రీకాంత్, అజాం అలీ తదితరులు పాల్గొన్నారు.

Next Story