- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సభలో ప్రాజెక్టులపై పీపీటీకి అవకాశం ఇవ్వండి.. స్పీకర్‌కు బీఆర్ఎస్‌ఎల్పీ వినతి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం (బీఆర్ఎస్‌ఎల్పీ) స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం (బీఆర్ఎస్‌ఎల్పీ) స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు సోమవారం స్పీకర్ ఛాంబర్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ వినతిని స్పీకర్ పరిశీలనకు తీసుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ (పీపీటీ)కి అవకాశం కల్పించాలని నేతలు కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నదీ జలాలకు సంబంధించిన అంశాలపై చర్చ సందర్భంగా ప్రభుత్వపరంగా ప్రెసెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసిందన్నారు. ప్రభుత్వానికి పీపీటీ అవకాశం ఇచ్చినప్పుడు బీఆర్ఎస్‌కు కూడా ప్రెసెంటేషన్‌కు అనుమతిస్తేనే చర్చకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నీళ్లకు సంబంధించిన నిజాలు తెలియాలంటే ఆధారాలను డాక్యుమెంట్లు, వీడియోల రూపంలో లోతుగా వివరించాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశారు.






