BRSLP : నేడు మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

by Y. Venkata Narasimha Reddy |

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ(BRSLP)సమావేశం నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

BRSLP : నేడు మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ(BRSLP)సమావేశం నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్న ఈ సమావేశంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

ఏడాదిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన విధానాల్లోని లోపాలను, ప్రజలు ఎదుర్కొంటుున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్గదర్శకం చేస్తారు. రాష్ట్రంలో చర్చనీయాంశమైన హైడ్రా, లగచర్ల ఉదంతాలు, గురుకులాల్లోని సమస్యల అంశాలను శాసన సభ, మండలి దృష్టికి తేవడానికి చేపట్టా్ల్సిన చర్యలను వారికి కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తారని తెలుస్తుంది.

Next Story