కోయంబత్తూరుకు కేటీఆర్.. గర్వంగా ఉందని బీఆర్ఎస్ ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-10 15:40:24  IST  )

బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) రేపు కోయంబత్తూర్‌కి వెళ్ళనున్నారు.

కోయంబత్తూరుకు కేటీఆర్.. గర్వంగా ఉందని బీఆర్ఎస్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) రేపు కోయంబత్తూర్‌కి వెళ్ళనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్టాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన రేపు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలలో కేటీఆర్ పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నారు. యువతలో ఆవిష్కరణా దృక్పథం, టెక్నాలజీ ప్రోత్సాహం, మోటార్‌స్పోర్ట్స్‌ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.

Next Story