- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు : కాంగ్రెస్ పై విరుచుకుపడిన కేటీఆర్
కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించిన ఆయన.. షేక్ పేట్ లోని సమతా నగర్లో పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తే.. దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉనికిలో లేని ఫోర్త్ సిటీని పక్కనపెట్టి.. ఉన్న సిటీని పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీతను గెలిపించాలని ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.






