ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు.. సర్కస్ : ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ ధ్వజం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-01 05:42:56  IST  )

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్. అసమర్థత, అజ్ఞానం రాష్ట్రాన్ని ఏలుతున్నాయంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు.. సర్కస్ : ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతులేని అరాచకత్వం, అపరిమిత అజ్ఞానం రాష్ట్రాన్ని ఏలుతున్నాయని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు.. సర్కస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఎక్స్(X)లో ఈ మేరకు పోస్ట్ చేశారు. పాలమూరు, ఎల్లారెడ్డి, జడ్చర్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు.

‘స్థానిక సమస్యలు తీర్చడానికి

రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు

పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!

భారీవర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే

రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని

ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు

ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే!

రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు

సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి

పరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడీయిజం చేస్తాడు

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!

అంతులేని అరాచకత్వమూ,

అపరిమితమైన అజ్ఞానమూ

రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో.

సర్కారు కాదిది సర్కసే!’ అని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

Next Story