హైదరాబాద్ యాత్రికులు చనిపోవడం బాధాకరం.. సౌదీ బస్సు ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-20 06:13:22  IST  )

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం బాధాకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ యాత్రికులు చనిపోవడం బాధాకరం.. సౌదీ బస్సు ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని బదర్ - మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో.. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులుండగా.. ఒకే ఒక వ్యక్తిప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 45 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వీరంతా హైదరాబాద్ వాసులేనని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలో ఉన్నారని సమాచారం అందుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఊహించని రీతిలో ప్రమాదంలో మరణించినవారి వివరాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా నిలవాలన్నారు.

Next Story