- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు.. సీఎస్‌కు BRS ఫిర్యాదు
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sircilla Collector Sandeep Kumar Jha)పై సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari)కి బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sircilla Collector Sandeep Kumar Jha)పై సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari)కి బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. అనంతరం వారు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సిరిసిల్లలో కేటీఆర్(KTR)పై అభిమానంతో ఓ అభిమాని టీ షాప్(Tea Shop) నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడమే కాకుండా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఇబ్బందుల గురిచేస్తున్నారు. స్వయంగా సిరిసిల్ల కలెక్టర్ అధికార దర్పంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపెడుతున్నారని అన్నారు. అందుకే సిరిసిల్ల కలెక్టర్(Sircilla Collector)పై సీఎస్‌కు కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా షాపును క్లోజ్ చేయడం ఏంటని ఆగ్రహించారు.
బీఆర్ఎస్(BRS)కు అనుకూలంగా ఉన్న వారిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పరిపాలన మీద పట్టులేదని.. కేవలం కక్షసాధింపు చర్యలమీదే ఆయన దృష్టి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మొన్న టీ షాపు యజమానిని ఇబ్బంది పెట్టారు.. నేడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు.. ఇలా మొదటిసారి కాదని.. రోజూ ఇదే తంతు అని అన్నారు. రాష్ట్రంలో అధికారుల పనితీరుపై CSకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం.. చర్యలు తీసుకొని నియంత్రించాలని విజ్ఞప్తి చేశాం.. నియంత్రించకపోతే బీఆర్ఎస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని కీలక ప్రకటన చేశారు.






