అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్: ప్రతిపక్షం గళం నొక్కుతున్నారని ఫైర్!

by Gantepaka Srikanth |

తెలంగాణ శాసనసభలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది.

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్: ప్రతిపక్షం గళం నొక్కుతున్నారని ఫైర్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మూసీ డీపీఆర్ (DPR) మరియు ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తున్న సమయంలో, బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కీలకమైన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వచ్చారు.

ప్రభుత్వంపై విమర్శల దాడి..

వాకౌట్ అనంతరం మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేవలం రెండు నెలల్లోనే డీపీఆర్ ఎలా తయారవుతుందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ గణాంకాలు చెబుతున్నారని ఆరోపించారు. 1,435 నిర్మాణాలు అని చెబుతున్నా, వాస్తవానికి వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగడం లేదని ధ్వజమెత్తారు.

Next Story