తెలంగాణ శాసనమండలి నుంచి BRS వాకౌట్

by Gantepaka Srikanth |

అధికార కాంగ్రెస్(Congress Govt) ప్రవేశ పెట్టిన కులగణన సర్వే నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ శాసనమండలి నుంచి BRS వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్(Congress Govt) ప్రవేశ పెట్టిన కులగణన సర్వే నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. కులగణన పేరుతో బీసీల హక్కులు కాలరాస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి(Sirikonda Madusudhana Chary) ఆరోపించారు. అందుకే నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో కులగణన(Caste Census), ఎస్సీ వర్గీకరణ(SC Classification) నివేదికలను కేబినెట్ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి రికార్డు సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. భవిష్యత్తులో ఏ సర్వే జరిగినా ఇదే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.

తాము ఏ పని చేసినా బాధ్యత, చిత్తశుద్ధితో చేశామని తెలిపారు. కేసీఆర్(KCR) కుటుంబం ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసమే చేసిందని విమర్శించారు. వర్గీకరణ జరగాలి అని ఎప్పటి నుంచో మాదిగ, మాలలు పోరాటం చేస్తున్నారని దానికి అనుగుణంగానే తాము కులవర్గీకరణ చేపట్టామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు, కమిషన్ నివేదిక, సబ్ కమిటీ నివేదిక సూచన ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 56% శాతం బీసీలు, 17 % ఎస్సీలు ఉన్నారు. ఈ కులగణన, ఎస్సీ వర్గీకరణ ద్వారా 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story