పాలేరులో BRS Vs కాంగ్రెస్ ఫైటింగ్ (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-30 16:26:34  IST  )

తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

పాలేరులో BRS Vs కాంగ్రెస్ ఫైటింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల పార్టీల కార్యకర్తలు ప్రలోభాలపై ఫోకస్ పెట్టారు. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పాలేరు నియోజకవర్గం నాయకన్ గూడెంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక, పాలేరులో కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ తరఫున కందాళ ఉపేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.

Next Story