- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR : వరంగల్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ : కేసీఆర్
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు(BRS Silver Jublee Celebrations) ఘనంగా జరిపేందుకు గులాబీ పార్టీ భారీగా ప్రణాళికలు రచిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు(BRS Silver Jubli Celebrations) ఘనంగా జరిపేందుకు గులాబీ పార్టీ భారీగా ప్రణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిపేందుకు సిద్ధం అయింది. శుక్రవారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత(BRS Cheif) కేసీఆర్(KCR) సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. అందులో ఆ పార్టీ స్థాపించి 25 ఏళ్లు నిండబోతున్న సందర్భంగా.. రజతోత్సవ వేడుకలకు సిద్ధం కావాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ హాజరు కానున్నట్టు సమాచారం. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున వరంగల్(Warangal) లో లక్షలాది మందితో భారీ బహిరంగసభ(Public Meeting) జరపనున్నట్టు ప్రకటించారు.
అలాగే పార్టీ సంస్థాగత విషయాలు, సభ్యత్వ నమోదు వంటి విషయాలు, పలు కమిటీల ఏర్పాటు వంటి విషయాలపై కేసీఆర్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పోరాటానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. లోక్ సభ(Lok Sabha)లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా పోవడం విచారకరం అని, అందువల్ల ప్రజల తరపున మన గొంతుకను పార్లమెంటు(Parliament)లో వినిపించలేకపోతున్నామని అన్నారు. తెలంగాణ హక్కులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణకు ఎప్పటికీ రక్షణ కవచం బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ పేర్కొన్నారు.






