పార్టీ మారిన ఎమ్మెల్సీలకు షాక్.. సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్

by Gantepaka Srikanth |

స్థానిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్(BRS) అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పార్టీ మారిన ఎమ్మెల్సీలకు షాక్.. సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్(BRS) అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ విషయంలో కేటీఆర్(KTR) స్వయంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయమై కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ వెంట వెళ్లిన పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. పార్టీ మారితే నైతికంగా తమ పదవులు వదులుకొని కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని, కానీ చట్టబద్ధం కానీ ఫిరాయింపులకుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేయబోతున్న పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story