- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఈఆర్సీ ముందుకు బీఆర్ఎస్.. ‘రైతు డిస్కం’ కుట్రలపై కేటీఆర్ పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వ ‘రైతు డిస్కం’ ప్రతిపాదనలపై రేపు ఈఆర్సీ (ERC) ముందుకు బీఆర్ఎస్ వెళ్లనుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రైతు డిస్కం’ అంశం నిప్పు రాజేసింది. ఆ నిర్ణయాల వెనుక ఉన్న అసలు వ్యూహాలను, కుట్రలను బట్టబయలు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) నిర్వహించనున్న కీలక ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హాజరుకానుంది. తెలంగాణ రైతాంగం, సామాన్య ప్రజల పక్షాన నిలబడి కమిషన్ ముందు తమ పవర్‌ఫుల్ వాదనలను వినిపించనుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం వహించనున్నారు. ఈ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో.. తెలంగాణ విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన ఉన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు.
‘రైతు డిస్కం’ పేరుతో కాంగ్రెస్ పెద్ద స్కెచ్..
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో తీసుకొస్తున్న నూతన సంస్కరణల వల్ల అటు అన్నదాతలకు, ఇటు రాష్ట్ర విద్యుత్తు రంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్న ప్రభుత్వ వైఖరిని, రైతులకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసేలా జరుగుతున్న అంతర్గత వ్యూహాలను సాక్ష్యాధారాలతో సహా ఈఆర్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన నిరంతర ఉచిత విద్యుత్ హక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా రేపటి సమావేశంలో కేటీఆర్ బృందం గళం విప్పనుంది.






