- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: చిట్టి కాళ్ల బేరాల రిజల్ట్స్ వచ్చినట్టుంది.. అరెస్ట్ వార్తలపట్ల కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అరెస్ట్(Arrest) వార్తల నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అరెస్ట్(Arrest) వార్తల నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా కాంగ్రెస్(Congress) పై విమర్శలు(Criticisms) చేస్తూనే.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిట్టి కాళ్ల బేరాల రిజల్ట్స్ వచ్చినట్టుంది అని ఎద్దేవా చేశారు. ఏం చేసినా చట్టపరంగానే ఎదుర్కుంటానని అధికార పక్షానికి తేల్చి చెప్పారు. దీనిపై ఆయన.. బీజేపీ(BJP)తో ఢిల్లీ(Delhi)లో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్(Jaipur) లో అదానీ(Adani)తో డిన్నర్(Dinner) రిజల్ట్ వచ్చినట్టుందని అన్నారు. అలాగే 30 సార్లు ఢిల్లీకి పోయిన 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే, మీ ఖర్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక గుడ్ లక్ చిట్టి నాయుడు అండ్ కో(Good Luck Chitti Naidu And Co).. మిమ్మల్ని లీగల్ గానే ఎదుర్కొంటానని(Face It Leagally) కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఏసీబీ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో కేటీఆర్ కు త్వరలోనే విచారణకు రమ్మని నోటీసులు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.






