- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో BRS బృందం భేటీ
సుప్రీంకోర్టు(Supreme Court) పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(Central Empowered Committee)తో తాజ్ కృష్ణా హోటల్ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నేతృత్వంలోని బృందం భేటీ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court) పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(Central Empowered Committee)తో తాజ్ కృష్ణా హోటల్ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నేతృత్వంలోని బృందం భేటీ అయింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులపై కమిటీకి బీఆర్ఎస్ పార్టీ బృందం నివేదిక సమర్పించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో వాస్తవాలను కమిటీకి వివరించారు. బీఆర్ఎస్ బృందంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, దేవిప్రసాద్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు హెచ్‌సీయూ(HCU)కు పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. ఈ భూముల చదును చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కమిటీ రాక నేపథ్యంలో హెచ్‌సీయూలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.






