స్మార్ట్‌ఫోన్ పంపిణీపై సీతక్కను టార్గెట్ చేసిన బీఆర్ఎస్.. మండిపడ్డ ఎన్‌ఎస్‌యూఐ

by Ramesh Naini |

బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక మంత్రి సీతక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి మండిపడ్డారు.

స్మార్ట్‌ఫోన్ పంపిణీపై సీతక్కను టార్గెట్ చేసిన బీఆర్ఎస్.. మండిపడ్డ ఎన్‌ఎస్‌యూఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ చొరవతో అంగన్వాడి టీచర్లకు చేయూతనిస్తూ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక మంత్రి సీతక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి మండిపడ్డారు. సీతక్క పై బీఆర్ఎస్ నేతల విమర్శలకు నిరసనగా సోమవారం గాంధీభవన్ దగ్గర మన్నె క్రిశాంక్ బీఆర్ఎస్ సోషల్ మీడియా దిష్టిబొమ్మను ఎన్ఎస్‌యూఐ విద్యార్థి విభాగం కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎడవల్లి వెంకట స్వామి మాట్లాడుతూ, మంత్రి సీతక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రిశాంక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లను కాపాడుతున్న కేటీఆర్ లకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

సీతక్క మీద బురద జల్లే ప్రయత్నం

ఆధారాలు లేని ఆరోపణ చేస్తూ సీతక్క మీద బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. స్కాములు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నాయకుల నైజం అని వెంకటస్వామి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు సీతక్కకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే వారి నివాసాలు, కార్యాలయాల ముట్టడికి తమ విద్యార్థి విభాగం చేపడుతుందని ఆయన హెచ్చరించారు.

Next Story