BRS: స్వామి వివేకానందుడి సూక్తులు స్పూర్తిదాయకం.. మధుసూధనా చారి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

స్వామి వివేకానందుడి సూక్తులు స్పూర్తిదాయకం అని బీఆర్​ఎస్​ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనా చారి అన్నారు.

BRS: స్వామి వివేకానందుడి సూక్తులు స్పూర్తిదాయకం.. మధుసూధనా చారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వామి వివేకానందుడి సూక్తులు స్పూర్తిదాయకం అని బీఆర్​ఎస్​ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనా చారి అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూధనా చారి ముఖ్య అతిథిగా హాజరు కాగా, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, మాజీ ఎంఎల్​ఏ డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కోతి కిశోర్ గౌడ్, ఫైనాన్స్ కమిషన్ మాజీ సభ్యుడు గోసుల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, మహిపాల్, రాజు, సారంగపాణి, విజయసాయి, మనోజ్, ముర్తుజా, సమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిరికొండ మధుసూధనా చారి మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని ప్రపంచానికి సమర్థవంతంగా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని, అతి పిన్న వయస్సులోనే చిరస్థాయిగా భారత సమాజంలో నిలిచిపోయారని కీర్తించారు. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఆగిపోవద్దు అంటూ భారత దేశ యువతను నిరంతర స్పూర్తిధాయకంగా నడిపిస్తున్న మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. మత్తు మందులు, డ్రగ్స్ మత్తులో జోగుతున్న యువతకు వివేకానందుడి జీవితం సరైన మార్గం చూపుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

Next Story