- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: విమర్శలు మాని, జీతాలు చెల్లించండి.. సీతక్క ట్వీట్ కు హరీష్ రావు రిప్లై
మంత్రి సీతక్క(Minister Seethakka) దీన్ని కూడా రాజకీయం శోచనీయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి సీతక్క(Minister Seethakka) దీన్ని కూడా రాజకీయం శోచనీయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. వేతనాలపై హరీష్ రావు చేసిన ట్వీట్ కు మంత్రి సీతక్క స్పందించారు. దీనికి హరీష్ రావు సమాధానం ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న చిరు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం మేం చేస్తే, సమస్యకు పరిష్కారం చూపకుండా మంత్రి సీతక్క దాన్ని కూడా రాజకీయం చేయడం శోచనీయమని విమర్శించారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో(KCR Government) పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులను ప్రతి నెలా మొదటి వారంలోనే విడుదల చేసేదని, దీంతో మొదటి వారంలోనే పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, సిబ్బందికి జీతాలు అందేవి అని గుర్తు చేశారు.
కానీ, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులను విడుదల చేయకపోవడం వల్ల చిరు ఉద్యోగులకు వేతనాలు అందని దుస్థితి వచ్చిందని ఆరోపించారు. అంతేగాక నెలల తరబడి వేతనాలు రాక ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారో కండ్లకు కట్టినట్లు చూపే పత్రిక క్లిప్స్ ను మీకు పంపుతున్నాను అని, ఇవి చూసైనా వస్తవాలు గ్రహించండి అని వార్త పత్రికల కథనాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల వలే చిరు ఉద్యోగులకు కూడా పే రివిజన్ వర్తింప చేసిన ఏకైక సర్కారు బీఆర్ఎస్(BRS) అన్న విషయం గుర్తు చేస్తున్నానని, మా మీద విమర్శలు చేయడం మాని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరారు.






