Breaking News : రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) మరోసారి పోరుకు సిద్ధమైంది.

Breaking News : రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) మరోసారి పోరుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇప్పటికె తీవ్ర విమర్శలు చేస్తున్న గులాబీ పార్టీ నాయకులు, వివిధ పద్ధతుల్లో రోజుకో రకమైన నిరసనలు(Protests) తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తవుతుందని.. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు(Election Gaurantees) కూడా 420 వంటివే కావడం వల్ల వాటిని నెరవేర్చడం లేదని కారు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు, ఆ పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలకు దిగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపునిచ్చారు. రేపు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి(Gandhi Death Anniversary) సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ.. ఆయా చోట్ల గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం రాయిలాగా ఉందని, ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు తెలిపినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని.. అందుకే విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామని ఆ పార్టీ వెల్లడించింది. దీంతో అయినా కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి కళ్ళు తెరుచుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. కాగా గత సోమవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో బీఆర్ఎస్వీ (BRSV) కాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హయాంలో తెలంగాణ (Telangana)ను దేశానికి దిక్సూచిలా తీర్చిదిద్దామని అన్నారు. వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 5 మెడికల్ కాలేజీలను 33కు పెంచామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ (Congress) చెప్పిందని.. 420 హామీలతో గెలిచి 15 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అందుక నిరసనగా జనవరి 30న గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. డూప్లికేట్ గాంధీలకు బుద్ధి వచ్చేలా చేయాలని ఆ మహాత్ముడిని కోరుతామని సెటైర్లు వేశారు.

Next Story