- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
ఈ నెల 19న నిర్వహించాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 19న నిర్వహించాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గనడం కోసం వాయిదా వేశారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని పార్టీ స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొంటారని పేర్కొంది. ఇక ఈ సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం, కార్యచరణ, రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.






