BRS: కాసేపట్లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్, మాజీ మంత్రులు

by Kema Shiva Kumar |

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ నల్లగొండ (Nalgonda) పట్టణంలో బీఆర్‌ఎస్‌ (BRS) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా (Raithu Maha Dharna)ను నిర్వహించనున్నారు.

BRS: కాసేపట్లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్, మాజీ మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ నల్లగొండ (Nalgonda) పట్టణంలో బీఆర్‌ఎస్‌ (BRS) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా (Raithu Maha Dharna)ను నిర్వహించనున్నారు. క్లాక్‌ టవర్‌ (Clock Tower) వేదికగా నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (MLA Jagadish Reddy), ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు (Former MLA's), జడ్పీటీసీలు హాజరు కానున్నారు. రైతు మహా ధర్నాలో పాల్గొనేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చే అవకాశం ఉంది.

మహా ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడు రమావత్‌ రవీంద్ర కుమార్‌ (Ravindra Kumar), మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌ రెడ్డి (Kancharla Bhupal Reddy), గాదరి కిశోర్‌ కుమార్‌ (Gadari Kishore Kumar) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహా ధర్నాను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణ మాఫీ (Loan Waiver), చేసిన రుణ మాఫీ, రైతు భరోసా (Raithu Bharosa) కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్‌ను నిలదీయనున్నారు. అయితే, ఈనెల 21 మహా ధర్నా జరగాల్సి ఉండగా.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు పర్మీషన్ ఇవ్వలేదు. అయితే, ధర్నాకు అనుమతులపై సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ను ఆశ్రయించారు. దీంతో 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Next Story