బీఆర్ఎస్ సైనికులారా, ఉపఎన్నికలకు సిద్దంగా ఉండండి.. కేటీఆర్ సంచలన పిలుపు

by Ramesh Goud |   (  Updated:2025-02-03 08:59:13  IST  )

బీఆర్ఎస్ పార్టీ సైనికులారాBRS party soldiers.. ఉప ఎన్నికలby-electionsకు సిద్దంగా ఉండాలని మాజీంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్BRS working president KTR పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ సైనికులారా, ఉపఎన్నికలకు సిద్దంగా ఉండండి.. కేటీఆర్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ సైనికులారా(BRS party soldiers).. ఉప ఎన్నికల(by-ఎలేచ్షన్స్)కు సిద్దంగా ఉండాలని మాజీంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి అని సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం(Constitution) నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు(previous judgments) స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ(Congress party)ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని చెప్పారు.

అంతేగాక త్వరలో ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సైనికులం సిద్ధంగా ఉందామని రాసుకొచ్చారు. కాగా బీఆర్ఎస్ పార్టీ(BRS party)నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ(Congress ప వెళ్లిన ఎమ్మెల్యేమ అనర్హత కింద ప్రకటించాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) జస్టిస్ వినోద్ చంద్రన్(Justice Vinod Chandran)ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ను.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లపై, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి(MLAs Padi Kaushik Reddy), వివేకానంద(Vivekananda)వేసిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది.

అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గి(Mukul Rohatgi) కిఅందజేయాలని చెప్పింది. అంతేగాక పార్టీ పిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డా. సంజయ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో వీరిపై పిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు.

Next Story