- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌత్ఆఫ్రికాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
సౌత్ఆఫ్రికాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : సౌత్ఆఫ్రికాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఈ మేరకు బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో జొహనెస్‌బర్గ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఏటా ప్రతి చలికాలంలో సౌత్ ఆఫ్రికా లోని వివిధ ప్రాంతాలలో దుప్పట్లను ఉచితంగా పంపిణి చేస్తారు . ఈ సంవత్సరం కూడా సౌత్ ఆఫ్రికా బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సౌత్ ఆఫ్రికాలో పలుచోట్ల అలాగే పోలీస్ స్టేషన్స్ ల లో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికా బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ బీఆర్ఎస్పార్టీ రజతోత్సవ వేడుకలో మాతో పాటే సౌత్ ఆఫ్రికా మిస్ వరల్డ్ జోలిజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ పాల్గొన్నారన్నారు. పేదలకు ఉచితంగా దుప్పట్ల పంపిణీలో మాతో పాటు చేరడం మాకు సంతోషంగాను, గౌరవంగాను ఉందన్నారు.
కాగా సమీప పోలీస్ స్టేషన్ విక్టిమ్ ఎంపవర్మెంట్ సెంటర్ లో పార్టీ కార్య వర్గ సభ్యులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. పేదలకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ శీతాకాలములో దుప్పట్ల పంపిణీ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికా పోలీసులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ శాఖ గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ శాఖ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి మేడసాని , హరీష్ రంగ,అరవింద్ చీకోటి, జ్యోతి వాసిరెడ్డి , శిరీష కట్ట ,వెంకట్ రావు ,సౌజన్ రావు, శివా రెడ్డి ,సాయి వేముల , రాజ్ నామ,సాయి కిరణ్ నల్ల , వూరే వంశీ ,సందీప్ రెడ్డి ,రమణ అంతటి ,నిర్మల్ నాని ,సుధీర్ బోనం, రాజు కుప్పు,రంజిత్ కుమార్ ,లక్ష్మణ్ వెన్నపురెడ్డి , ఉమా మేహేశ్వర్, మురళి బండారు , కాశి తదితరులు పాల్గొన్నారు






