విదేశీ గడ్డపై బీఆర్ఎస్ షో: డల్లాస్‌లో లీడర్ల సందడి, విమర్శల సెగ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-31 04:25:20  IST  )

జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ వేడుకలు చాలా ఖరీదుగా మా రాయని ప్రచారం జరుగుతున్నది. సభ ఏర్పాట్లు, అతి థుల వసతులు, రానుపోను ఖర్చులు కలుపుకుని దాదా పు రూ.60కోట్లు దాటుతుందని చర్చ పార్టీ వర్గా ల్లో వినిపిస్తోంది.

విదేశీ గడ్డపై బీఆర్ఎస్ షో: డల్లాస్‌లో లీడర్ల సందడి, విమర్శల సెగ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ వేడుకలు చాలా ఖరీదుగా మా రాయని ప్రచారం జరుగుతున్నది. సభ ఏర్పాట్లు, అతి థుల వసతులు, రానుపోను ఖర్చులు కలుపుకుని దాదా పు రూ.60కోట్లు దాటుతుందని చర్చ పార్టీ వర్గా ల్లో వినిపిస్తోంది. అయితే ఈ ఖర్చు మొత్తం పార్టీ భరిం చడం లేదు. అందుకోసం అమెరికాలోని బీఆర్ఎస్ మద్దతుదారులు విరాళాలు సేకరించి సభను నిర్వహిస్తున్నారని ప్రచారం ఉంది. ఆసభలో పాల్గొనేందుకు పార్టీ ఎ మ్మెల్యేలు, లీడర్లు, కళాకారులు అక్కడికి చేరుకున్నారు.

నెలన్నరగా ఫోకస్

డల్లాస్ నగరంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల కోసం సుమారు నెలన్నరగా బీఆర్ఎస్ మద్దతు దారులు బిజీగా ఉన్నారు. వేడుకలకు కావాల్సిన నిధుల కోసం విరాళాలు సేకరించారు. డల్లాస్, ఇతర సిటీల్లో ఉంటోన్న తెలుగు ప్రజలను మీటింగ్ రప్పించే పనిలో ఉన్నారు. అలాగే రాష్ట్రం నుంచి డల్లాస్‌కు వచ్చే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కళాకారులకు వసతి, భోజనాల ఏర్పాట్లను కొందరికి అప్పగించారు. ఓ ప్రాంతీయ పార్టీ విదేశీగడ్డపై సభ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ధనిక దేశంలో అత్యంత ప్రముఖ నగరంలో మీటింగ్ పెట్టేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు కోసం యూఎస్‌లో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది. సభ ఏర్పాట్లు, హోటల్ ఖర్చులు, విమాన చార్జీలు కలుపుకుని దాదాపు రూ.60 కోట్లుపైనే ఖర్చు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

విదేశీగడ్డపై హడావుడి ఎందుకు?

ఏదైన పార్టీ తను ప్రాతినిథ్యం వహించే ప్రాంతంలో పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించడం సహజం. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అమెరికాలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అంతగా ఖర్చు చేసి అక్కడ వేడుకలు నిర్వహించడం ఎందుకు? దాన్ని వల్ల పార్టీకి ఏం ప్రయోజనం? పేరుకే జాతీయ పార్టీగా మిగిలిపోయిన గులాబీ పార్టీకి అంత హంగామా ఎందుకు? అని కేడర్ చర్చించుకుంటున్నారు. విపక్ష పార్టీగా నిత్యం ప్రజల్లో ఉండేందుకు చొరవ చూపాలి. కానీ బీఆర్ఎస్ లీడర్లు మాత్రం ఇప్పటికీ అధికారదర్పంతోనే వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చేవిధంగానే డల్లాస్‌లో వేడుకలు నిర్వహించడం, అందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఒక్కో లీడర్ ఖర్చు రూ.10 లక్షలు

డల్లాస్‌కు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, లీడర్లు ఒక్కొక్కరు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అయితే కొందరు ఇష్టంతో వెళ్లగా, మరికొందరు పార్టీ ఒత్తిడి మేరకు వెళ్లినట్లు ప్రచారం ఉంది. డల్లాస్‌కు తప్పకుండా రావాలని ఒకటికి రెండు సార్లు కేటీఆర్ ఆఫీసు నుంచి ఫోన్లు రావడంతో అయిష్టంగా విదేశీ యాత్రకు రెడీ అయినట్లు తెలుస్తున్నది.

డల్లాస్‌కు క్యూ కట్టిన గులాబీ నేతలు

భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు విదేశీ పర్యటనల్లో ఉన్నారు. అమెరికా డల్లాస్‌లో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి అమెరికా పయనమయ్యారు. డల్లాస్‌లోని సమావేశంలో తెలంగాణ ఆట పాట వినిపించడానికి ఇక్కడి నుంచి రసమయితో పాటు మరికొందరు కళాకారులు అక్కడికి వెళ్లారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్​రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్​గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతి కిరణ్, బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, పైలెట్ రోహిత్ రెడ్డి, కోరుకంటి చందర్, నోముల భగత్, రసమ యి బాలకిషన్, గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటుగా పార్టీ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, దామోదర్ గుప్తా, గండ్ర జ్యోతి, పి.కార్తిక్ రెడ్డి, ద్వితీయ శ్రేణి నాయకులు మాజీ ఎంపీపీ గోవర్ధన్, మాజీ జడ్పీటీసీ అవినాశ్​రెడ్డి, ఆశీశ్ యాదవ్, రంగినేని అభిలాషరావు, ముఠా జయసింహ, మంచిరెడ్డి బంటి, యుగంధర్ రావు, ఓ.నర్సింహరెడ్డి తదితరులున్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్​ న్యూజిలాండ్ వెళ్లారు.

Also Read..

కవిత ఆరోపణలతో గులాబీ పార్టీలో విభేదాలు.. కేసీఆర్ మౌనంపై అనుమానాలు

Next Story