విదేశాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విదేశాల్లో ఘనంగా ఏర్పాటు చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా జూన్ 2న అమెరికాలోని డల్లాస్ లో ఎన్ఆర్ఐలతో భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభకు విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలను సమీకరించేందుకు చర్యలు మొదలు పెట్టింది.

విదేశాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
X
  • జూన్ 2న డల్లాస్ భారీ సభ - హాజరుకానున్న కేటీఆర్
  • పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విదేశాల్లో ఘనంగా ఏర్పాటు చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా జూన్ 2న అమెరికాలోని డల్లాస్ లో ఎన్ఆర్ఐలతో భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభకు విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలను సమీకరించేందుకు చర్యలు మొదలు పెట్టింది. బుధవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల పోస్టర్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, అభిలాష్ రంగినేని, పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు, తెలుగు వారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో రాష్ట్రంలో అనేక అద్భుతాలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ నిర్వహించిన ఎల్కతుర్తి బహిరంగ సభకు కనివినీ ఎరుగని రీతిలో జనం వచ్చారని పేర్కొన్నారు. డల్లాస్ లో నిర్వహించే సభకు కేటీఆర్ హాజరవుతారని చెప్పారు. ఎన్ఆర్ఐలు ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు ముందుకు రావడం మంచి పరిణామం పేర్కొన్నారు. అమెరికాతో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, లాంటి దేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని తెలిపారు.

Next Story