- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రసాభాసగా మారిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. టీపీసీసీ నేత సామా సంచలన వీడియో
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ రసాభాస సభగా మారిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ (TPCC Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ రసాభాస సభగా మారిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ (TPCC Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవాల పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపు 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సభకు పెద్ద ఎత్తున జనం హజరవుతారని భారీ ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే సభలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ధూందాం కళాకారుల బృందంతో కళావేదికను వేదికను ఏర్పాటు చేశారు. ఈ కళావేదికపై రసమయి బాలకిషన్ కు ఓ వ్యక్తికి మధ్య వాగ్వాధం చోటు చేసుకోవడంతో ఆ వ్యక్తిని బౌన్సర్ల చేత కిందికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సామా.. బీఆర్ఎస్ నేతలపై సంచలన విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. రసాభాస సభగా మారిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ (BRS Party Silver Jubilee Meeting) అని, అందరూ చూస్తుండగా వేదిక మీదనే పింకీల పీకులాట! అని అన్నారు. అలాగే ఒక్కప్పుడు కేసీఆర్ (KCR) అంటే భయం ఉంటుండే, ఇపుడు క్రమశిక్షణ తప్పింది అని కామెంట్ చేశారు. అంతేగాక కవిత (Kavitha) ఎంట్రీ కోసం పాట పాడమని సింగర్ ని పంపితే, అసహనంతో బౌన్సర్లను పెట్టి కింది నూకిన ఓ వర్గం లీడర్ రసమయి? అంటూ.. వేదిక మీదనే కొట్టుకుంటూ ఇజ్జత్ తీసుకున్న పింకీలు అని టీపీసీసీ నేత రాసుకొచ్చారు.






