- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒరిజినల్ పార్టీ బీఆర్ఎస్సా, లేక టీఆర్ఎస్సా అన్నది తేల్చుకోవాలని, ఆయన మంత్రిగా పదేళ్లలో నల్గొండ జిల్లాకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒరిజినల్ పార్టీ బీఆర్ఎస్సా, లేక టీఆర్ఎస్సా అన్నది తేల్చుకోవాలని, ఆయన మంత్రిగా పదేళ్లలో నల్గొండ జిల్లాకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మండిపడ్డారు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నాడు కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఆయన కుర్చీ వేసుకుని కూర్చున్నారని విమర్శించారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలోనే తన్నుకుంటున్నారని, వారు ఏం చేశారని నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరతారని శంకర్ నాయక్ ప్రశ్నించారు.
బీజేపీలో కలవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఏ అంశం లేక బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపైన మాట్లాడుతున్నారని, గతంలో మిల్లర్లతో బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, చివరి గింజ వరకు కొంటున్నామని శంకర్ నాయక్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు అంతా ఎక్కడిక్కడ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ను పూర్తి చేస్తున్నామని శంకర్ నాయక్ తెలిపారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడటం వేస్ట్ అని, బీజేపీతో లాలూచీ పడాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదు.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






