- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరతపై గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’ అంటూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కామెంట్ చేశారు. కానీ ప్రభుత్వం ప్రభుత్వం తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై మాట్లాడే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదన్నారు. కచ్చితంగా 15 రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారని డిమాండ్ చేశారు. యూరియా కొరతపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నా కాంగ్రెస్ నాయకులపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్, అకాల వర్షాలు, సీజనల్ వ్యాధులపై సభలో చర్చించాలన్నారు.
Also Read..
ఇది కాంగ్రెస్ కాదు.. స్కామ్‌గ్రెస్..! కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్






