- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vinod Kumar: సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కాదా?
రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్నారని.. నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించినా చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్నారని.. నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించినా చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా మూడు రోజుల గడువే ఉన్నదని.. ఎన్నికల కమిషన్ దృష్టికి బీఆర్ఎస్ చాలా అంశాలు తీసుకెళ్లిందని.. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాలు కోడ్‌ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని సీఎం అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని మంత్రి అజారుద్దీన్ అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం ఎలా చేస్తారో చూస్తా అని కాంగ్రెస్ అభ్యర్థి బెదిరించడం కోడ్ ఉల్లంఘన కాదా? అని అడిగారు. ఎన్నికల ప్రధానాధికారికి ప్రతిరోజూ తమ పార్టీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు సీఈవో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
సుదర్శన్‌రెడ్డి తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదని.. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు కనీసం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈసీ పక్షపాత వైఖరిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామని వెల్లడించారు. మత కలహాలు రేపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని.. ఎన్నిక ముగిసేలోపు ఏవైనా ఘర్షణలు జరిగితే సీఈవోదే బాధ్యత అని అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయకపోతే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. కేంద్ర బలగాలను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మోహరించాలని, ఢిల్లీలోనూ తమ బృందం సీఈసీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు.






