కాంగ్రెస్ అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేయాలి

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఎన్నికల్లో చంపేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరిస్తున్నారని.. ఆయనను వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని ఎన్నికల కమిషన్‌ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

కాంగ్రెస్ అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఎన్నికల్లో చంపేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరిస్తున్నారని.. ఆయనను వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని ఎన్నికల కమిషన్‌ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఈ కేసును సుమోటోగా టేకప్ చేయాలని కోరామని తెలిపారు. సినీ కార్మికులకు హామీలు ఇచ్చారని.. ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. పెన్ డ్రైవ్‌లో ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు సమర్పించామని చెప్పారు.

స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని తొలగించాలని కోరినట్లు తెలిపారు. అలాగే.. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర పోలీసులు కావాలని అడిగినట్లు తెలిపారు. సెంట్రల్ నుంచి ఒక అబ్జర్వర్‌తోపాటు, కేంద్ర బలగాలను కూడా తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సభ అట్టర్ ప్లాఫ్

సీఎం రేవంత్ మంగళవారం నిర్వహించిన సభ అట్టర్ ప్లాఫ్ అయిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం సభకు బలవంతంగా మెడపై కత్తి పెట్టి తీసుకెళ్లారని.. అల్లు అర్జున్‌లాగా తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతోనే సీఎం సభకు వెళ్లారని ఆఱోపించారు. హాలీవుడ్‌ను తీసుకురావడం కాదని.. ఉన్న సినిమా రంగాన్ని కాపాడితే చాలని పేర్కొన్నారు. రెండేళ్లుగా సినిమా రంగం వారిని భయభ్రాంతులకు గురిచేసిన రేవంత్‌రెడ్డికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.

Next Story