బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-23 08:25:55  IST  )

బీఆర్ఎస్‌ (BRS)కు రాజకీయంగా ఇక భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ ఖేల్ ఖతం అయిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ పార్టీ ఖేల్ ఖతం అయిందని.. వంద జాకీలు పెట్టినా లేవదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో రాజు, యువరాజు ఫొటోలు తప్ప మరెవరివి కనిపించ లేదని కామెంట్ చేశారు. బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థి లేక బీజేపీకి ఓట్లు వేశారని ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో సైతం సిద్దిపేట (Siddipet), సిరిసిల్ల (Sirisilla) నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ మెజారిటీతో గెలుపొందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరూ ఆలోచించట్లేదని అన్నారు.

కాళేశ్వరం (Kaleshwaram) అనుభంధ ప్రాజెక్టులు మొత్తం కొట్టుకుపోతున్నాయని, మొత్తం 3 డ్యామ్‌లు తీసేయాల్సిందేనని అన్నారు. తాను సివిల్ ఇంజనీరింగ్ చేశానని.. ఆ విషయం తనకు తెలియదా అని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేక ఒక జోక్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి రాసిన లేఖ ఓ పద్ధతిగా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఆ లేఖను సృష్టించారంటూ కొందరు ఆరోపిస్తున్నారని.. అలా చేయడం తమకు అవసరం లేదన్నారు. అయినా.. కవిత తన తండ్రికి లేఖ రాయడమేంటని, అందులో ప్రస్తావించిన విషయాలనే నేరుగా చెప్పొచ్చు కదా అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఎలాంటి విబేధాలు లేవని.. పక్కా ప్లాన్ ప్రకారమే అన్ని పార్టీలను గందరగోళం నెట్టేందుకు ఆడుతున్న నాటకమని మంత్రి కోమటిరెడ్డి కామెంట్ చేశారు.

Next Story