NRI BRS CELL: కాంగ్రెస్ పాలన తీరుపై లండన్‌లో ఎన్ఆర్ఐల నిరసన..

by Ramesh Naini |

లండన్‌లో ఎన్ఆర్ఐ బీఆర్‌ఎస్ సెల్ యూకే ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనను నిరసిస్తూ సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు.

NRI BRS CELL: కాంగ్రెస్ పాలన తీరుపై లండన్‌లో ఎన్ఆర్ఐల నిరసన..
X

దిశ, డైనమిక్ బ్యూరో: లండన్‌లో ఎన్ఆర్ఐ బీఆర్‌ఎస్ సెల్ యూకే (NRI BRS UK) ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనను నిరసిస్తూ సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో యూకే నలు మూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరయ్యారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలతో నివాళులర్పించి, అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమం మన రైతుల్ని కాయపడుకోవాలని (#SAVEFARMERS), మన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని కాపాడుకోవాలని (#SAVEKALESHWARAM), మన హైదరాబాద్‌ని కాపాడుకోవాలని (#SAVEHYDERABAD)మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నేడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మోసం చేసి నాశనం చేసిందని వివరించారు.

నాడు కేసీఆర్ పాలనలో తెలంగాణలో వికాసం జరిగితే నేడు కాంగ్రెస్ అరాచక పాలనలో విధ్వసం జరుగుతుందని విమర్శించారు. లండన్‌లో నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించామని, కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే నేడు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకుండా పోయిందని, ఉద్యమ కారులుగా చాలా బాధపడ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో పెట్టుబడులతో పరుగులు పెట్టిందని, నేడు పెట్టుబడుల ఊసే లేదని, కానీ లక్షల్లో అప్పులు చేశారని అనిల్ కూర్మాచాలం విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, ప్రతిపక్ష నాయకులని అక్రమ కేసులలో ఇరికించే వాటిపై శ్రద్ధ మానేసి పాలనపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను నేడు కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనతో అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్తు ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రజలంతా తమ గొంతు వినిపించే సమయం వచ్చిందని, #RAISEYOURVOICE అనే నినాదంతో ఈ నిరసన చెప్పట్టామని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలన దాదాపు రెండు సంవత్సరాలు ముగుస్తుందని, కానీ చెప్పుకోడానికి కనీసం ఒక్క కార్యక్రమం చెయ్యలేదని ధ్వజమెత్తారు. నేటి నుంచి అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ అటు తెలంగాణ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస బిడ్డలకు తెలియజేసేలా అటు ప్రధాన మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తామని నవీన్ రెడ్డి తెలిపారు.

Next Story