BRSLP: ప్రభుత్వంపై బీఆర్ఎస్ఎల్పీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్

by Y. Venkata Narasimha Reddy |

BRSLP: ప్రభుత్వంపై బీఆర్ఎస్ఎల్పీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై బీఆర్ఎస్ శాసనసభా పక్షం(Brslp) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు(Notice of violation of assembly rights)ఇచ్చింది. శాసన సభ ఆమోదం పొందని భూ భారతి బిల్లును చట్టంగా పత్రికల్లో ప్రభుత్వ ఖర్చులతో ప్రకటనలు ఇవ్వడం శాసన సభ్యులను అవమానపరచడమేనని నోటీస్ లో పేర్కొంది. అందుకే తాము ప్రభుత్వంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పష్టం చేసింది. రాష్ట్ర శాసన సభలో బిల్లు రూపంలో చర్చ దశలో ఉన్నటువంటి విషయాన్ని చట్టంగా పేర్కొంటూ డిసెంబర్ 19న అన్ని పత్రికల్లో ప్రభుత్వం ప్రకటలను జారీ చేసిందని నోటీసులో గుర్తు చేసింది.

అసెంబ్లీ ఆమోదించని బిల్లును చట్టంగా పేర్కొంటూ శాసన సభ్యులను, శాసన వ్యవస్థను అవమానించిందని, శాసన సభ్యులకు రాజ్యాంగం అర్టికల్ 245ద్వారా దక్కిన చట్టాలను చేసే రాజ్యాంగ హక్కును కాలరాయడమేనని బీఆర్ఎస్ఎల్పీ తప్పుబట్టింది. అందుకే సభా నియమావళి 168(1)నిబంధన మేరకు ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నామని, ఈ విషయమై స్పీకర్ తగిన చర్యలు తీసుకుని సభా గౌరవాన్ని, సభ్యుల హక్కులను, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడాలని నోటీస్ లో కోరింది.

Next Story