- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raitu Maha dharna : బీఆర్ఎస్ నల్గొండ రైతు మహాధర్నా వాయిదా
నల్లగొండ(Nalgonda) కేంద్రంతో రేపు ఆదివారం బీఆర్ఎస్(BRS) పార్టీ నిర్వహించ తలపెట్టిన.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకావాల్సిన రైతు మహాధర్నా(Raitu Maha Dharna) కార్యక్రమాన్ని వాయిదా(Postponed)వేస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : నల్లగొండ(Nalgonda) కేంద్రంతో రేపు ఆదివారం బీఆర్ఎస్(BRS) పార్టీ నిర్వహించ తలపెట్టిన.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకావాల్సిన రైతు మహాధర్నా(Raitu Maha Dharna) కార్యక్రమాన్ని వాయిదా(Postponed)వేస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కాకుండా రైతు మహాధర్నాను వాయిదా వేస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. తిరిగి సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున రైతు మహాధర్నాను నిర్వహించనున్నట్లుగా పేర్కొంది.
నల్లగొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పండగ ప్రయాణాలు, రహదారుల రద్దీ, పండగ వాతావరణం తదితర కారణాలతో ప్రస్తుతం రైతు మహాధర్నా వాయిదా వేశామని.. పండగ తర్వాత యధావిధిగా మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని.. రైతు భరోసా 15 వేల నుంచి 12 వేలకు తగ్గించారని, రూ.2లక్షల రుణమాఫీ సగమే చేశారని, ఈ రెండింటిని అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్ ఈ ఫార్ములా రేసు కేసు పేరుతో కుట్రలు చేస్తుందని ఆరోపించారు. లగచర్ల, హైడ్రా, మూసీ, గురుకులాలు, రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాల్లో ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటాన్ని సహించలేక అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. .ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల్లో ఇరికించాలని చుస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేలతో సహా కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేయాలనీ చుస్తున్నారని ఆరోపించారు.
సమగ్ర శిక్ష సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్ వాడి సిబ్బంది, ఆటో వర్కర్స్ సమస్యలు సర్కార్ కు పట్టడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో జైలుకు పోయాడు కాబట్టి నిన్ను పంపుతా అన్నట్లుగానే కేటీఆర్ పట్ల వ్యవహారిస్తున్నాడని విమర్శించారు. కేసులపై కాకుంగా పరిపాలనపై ఆయన దృష్టి పెట్టాలని హితవు పలికారు.






