- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ వాయిస్ లేకుండా చేసే ప్రయత్నం: MP
కేటీఆర్ వాయిస్ లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ వాయిస్ లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ను రాజకీయంగా బలహీనపర్చాలని గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ మంచి ప్రయత్నమని.. కేటీఆర్ విజన్‌తో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చెందిందని అన్నారు. రాజకీయ కక్షతో కేటీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
రాజకీయ కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి రూ.700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. చోటా భాయ్ అడగ్గానే బడే భాయ్ అనుమతి ఇచ్చారని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఏసీబీకి సంబంధం లేదని పేర్కొన్నారు. లై డిక్టేటర్ టెస్ట్‌కు సిద్ధమని కేటీఆర్ చెప్పారని.. ఏసీబీ విచారణకు సైతం హాజరయ్యారని.. ప్రజలకు సమాధానం చెప్పలేక రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బీ టీమ్‌గా మారిందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.






