- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: కాంగ్రెస్ మోసాన్ని తట్టుకోలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య
BRS: కాంగ్రెస్ మోసాన్ని తట్టుకోలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ మోసాన్ని తట్టుకోలేక నిండు ప్రాణాలర్పించిన సాయి ఈశ్వరాచారికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 42 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17 శాతం మాత్రమే కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రాణ త్యాగం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట బీరప్ప నగర్ లోని ఈశ్వరాచారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ సందర్భంగా దివంగత ఈశ్వరాచారి తల్లి ప్రమీల, సోదరుడు నందీశ్వర్,ఈశ్వరాచారి సతీమణి కవిత, కూతుళ్లు క్రితిక,సాయి చిట్టి, కుమారుడు సాయిదత్తాలను వారు ఓదార్చారు, పరామర్శించారు,తమతో పాటు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.






