- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేంద్ర బలగాలను దింపాలి : BRS
by Muthe.Rajitha |
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ప్రచారాలతో.. వాడీ వేడీ మాటల యుద్ధాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ప్రచారాలతో.. వాడీ వేడీ మాటల యుద్ధాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఉపఎన్నిక నేపథ్యంలో నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, దామోదర్ రావులు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో సహా, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సజావుగా సాగాలంటే.. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
Next Story






