- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: తప్పుల మీద తప్పులు చేస్తున్న సీఎం రేవంత్
రెండున్నర ఏళ్లుగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు.. వెళ్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధి మాత్రం ముందుకు పోవడం లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రెండున్నర ఏళ్లుగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు.. వెళ్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధి మాత్రం ముందుకు పోవడం లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి ఏం సూచనలు ఇచ్చేందుకు రాహుల్‌గాంధీ వచ్చారని ప్రశ్నించారు. యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని రాహుల్ పదే పదే మాట్లాడుతున్నారని.. మరి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం గురించి రాహుల్‌కు తెలియదా అని నిలదీశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూడా గాజాలా మారిందని.. రాహుల్‌గాంధీ ఖమ్మం వెళ్లి చూడాలని సూచించారు. పేద ప్రజలంతా ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ తప్పుల మీద తప్పులు చేస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని నిలదీశారు. రాహుల్‌గాంధీ బీసీల కోసం కొట్లాడకుండా.. పోలీసులతో వెలుగుమట్ల బాధితులను కొట్టిస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల ఇళ్లు కూల్చిన చోటే మళ్లీ కట్టించాలని డిమాండ్ చేశారు.






