- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలు నిరంకుశంగా మారాయి: ఎమ్మెల్సీ
రాష్ట్రంలో రాజ్యాంగ నిబద్ధత లేకుండా పోయిందని.. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిరంకుశంగా మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజ్యాంగ నిబద్ధత లేకుండా పోయిందని.. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిరంకుశంగా మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు అత్యంత దుర్మార్గంగా, హేయమైన రీతిలో జరుగుతున్నాయని ఆరోపించారు. పాలకపక్షం విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అందుకే బీఆర్ఎస్‌పై దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై దాడి చేశారని.. మాజీ మంత్రి హరీశ్‌రావును మంచిర్యాల జిల్లాలో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించకుండా అంతటా అధికారపక్షం కాంగ్రెస్ గెలిచిందని సర్టిఫికెట్లు ఇస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. కోదాడలో తమ పార్టీ అభ్యర్థి మామిడి దివ్యను కిడ్నాప్ చేశారని.. అక్కడ బీఆర్ఎస్ హిందూ అభ్యర్థినిని బురఖా కప్పి లోపలికి తీసుకెళ్లి విత్ డ్రా చేయించి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. స్పీకర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి కాంగ్రెస్ కండువాలు కప్పారని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.






