రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలి.. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

by Ramesh Naini |

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలి.. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలికి హాజరయ్యే ముందు గన్‌పార్క్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతోనే శాసనమండలికి చేరుకున్నారు. సస్పెన్షన్ తరువాత తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు.

అక్రమాలు నడుస్తుంటే తాము ప్రభుత్వానికి భజన చేయాలా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మండలి నుంచి సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. శాసనసభ వ్యవహారాల మంత్రే సభా సంఘాల విలువ లేదంటే ఎలా అని తెలిపారు. పొంగులేటి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారని.. ధనాన్ని మక్కుతూ ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని వదిలేది లేదని స్పష్టం చేశారు. పొంగులేటిని బర్తరఫ్ చేసే దాకా బీఆర్ఎస్ వదిలిపెట్టదని హెచ్చరించారు.

Next Story