- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ న్యూఇయర్ విషెస్
CM రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ న్యూఇయర్ విషెస్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(Dasoju Sravan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘‘మీ భాష మనిషి భాషలా లేదు.. సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన పశుభాషలా ఉంది. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి, బాధ్యత గల పదవిలో ఉండి కూడా వీధి రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారు. మొన్న కొడంగల్ వేదికగా సర్పంచ్‌లతో మీరు జరిపిన సమావేశం చూసిన తర్వాత, రాజకీయమంటే రౌడీయిజం, రాజకీయమంటే గుండాయిజం, రాజకీయమంటే కొన్ని కులాల కుమ్ములాటలేనన్నట్టు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చుతూ ముఖ్యమంత్రి కుర్చీకున్న విలువను కూడా సర్వనాశనం చేస్తున్నందుకు బాధ కలిగింది.
అనేక కష్టనష్టాలను ఓర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాటు అహర్నిశలు శ్రమించి అన్ని రంగాలలో అచంచలమైన అభివృద్ధిని సాధించిన బాధ్యతగల పెద్దమనిషిగా, కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేదు అని, మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, 'పాలనను పక్కనపెట్టి నీతిమాలిన విమర్శలు చేయవద్దు' అని హితవు పలికారే తప్ప, తన ప్రసంగంలో కనీసం మీ పేరు కూడా ఉచ్చరించకుండా తన హుందాతనాన్ని చాటుకున్నారు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిగా ఆ పెద్దాయన మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకుని, చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. కానీ, ఆ కనీస సంస్కారం లేని మీరు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పిచ్చివాడిలా ఊగిపోతూ, కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావులపై ప్రయోగించిన భాష అత్యంత జుగుప్సాకరం. మీ ఈ అనాగరిక వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ అరాచక వైఖరి, మీ ఫ్రస్ట్రేషన్, మీ పిచ్చి పతాక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి’’ అని లేఖలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. లేఖ






