రాజీవ్ గాంధీ మరణాన్ని గుర్తుచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ నాయకురాలు, జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

రాజీవ్ గాంధీ మరణాన్ని గుర్తుచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు, జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన భర్తను తలుచుకొని భార్య ఏడిస్తే.. రాజకీయం చేయడం దారుణం అని మండిపడ్డారు. గతంలో రాజీవ్ గాంధీ చనిపోతే ఎవరూ మీ లాగా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తలు చనిపోతే మహిళలు ఏడుస్తారు కదా? అలాంటి మహిళల గురించి అంత దిగజారే విధంగా మాట్లాడతారా? అని సీరియస్ అయ్యారు.

పక్కన ఇద్దరు మహిళలు, పీజేఆర్ కూతురు, మేయర్ విజయలక్ష్మి ఉండగా డ్రామా అంటూ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. అంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. కమ్మ సామాజికవర్గం వాళ్లు ఓట్లు వేస్తే అదే సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని పేర్కొన్నారు. అదే సామాజికవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని గుర్తుచేశారు. మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎలా అవుతుంది..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story